న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో నిరసన
విశాలాంధ్ర – అనపర్తి:అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన 11వ రోజుకు చేరింది. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, అనపర్తి ఎదుట గురువారం ఉద్యోగులు ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు.తమ సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓపీ విభాగం ముందు నినాదాలు చేశారు. గత 11 రోజులుగా తమ నిరసన కార్యక్రమం కొనసాగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


