విశాలాంధ్ర – కడియం : మండలంలోని మండల ప్రజా పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల వెంకాయమ్మపేట (కడియపులంక పంచాయతీపరిధి ) సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న సాక అనిత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా ఆమె శనివారం అవార్డును అందుకోనున్నారు. తరగతి గదిలో టీ ఎల్ ఎం ద్వారా వినూత్నంగా విద్యాబోధన చేయడం, వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే కరోనా కష్టకాలంలో కరోనా బారిన పడిన పేదలకు ఆహారం పంపిణీ చేయడంతో పాటు, తుఫాను బాధిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు నిర్వహించారు. హెచ్ఐవీ బాధితులకు పౌష్టికాహారం అందిస్తూ సామాజిక సేవలోనూ తన వంతు బాధ్యతను నిర్వర్తించారు. ఈ సేవా కార్యక్రమాలే ఆమెను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడంలో కీలకంగా నిలిచాయి.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సాక అనిత
- Advertisement -
RELATED ARTICLES


