Wednesday, February 5, 2025
Homeజిల్లాలుఅనంతపురంఅనంతపూర్ పట్టణంలో మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వ భవనాలు నిర్మించాలి

అనంతపూర్ పట్టణంలో మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వ భవనాలు నిర్మించాలి

ఇన్సాఫ్ నగర మైనారిటీ ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్

విశాలాంధ్ర- అనంతపురం : అనంతపూర్ పట్టణంలో మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వ భవనాలు నిర్మించాలని ఇన్సాఫ్ నగర మైనారిటీ ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్ పేర్కొన్నారు.
మంగళవారం స్థానిక అనంతపురం సీపీఐ జిల్లా పార్టీ కార్యాలయం లో మైనారిటీ వింగ్ ఇన్సాఫ్ నగర సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్ మాట్లాడుతూ… గార్లదిన్నెలో ఉన్న మైనార్టీ ఆంగ్ల మాధ్యమ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు సరైన వసతుల లేక నానా కష్టాలు పడుతున్నారన్నారు. చిన్నపాటి గదిలో 70 నుంచి 80 మంది విద్యార్థులు నిద్రిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు ఒకరిపై ఒకరు పడుకుంటూ తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు అన్నారు . ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లితండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల ఆవేదన చెందుతున్నారన్నారు .విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చి,పాఠశాల భవనాలను నాడు-నేడు కింద కార్పొరేట్ భవనాలుగా గత ప్రభుత్వం మార్చడం జరిగిందన్నారు. ఎవరూ కూడా చేయనంత అభివృద్ధి చేశాంః అంటూ గత ముఖ్యమంత్రి జగన్ తరుచూ అన్ని వేదికలపై చెప్పడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయికి వెళితే.. గత సీఎం జగన్ ప్రాధాన్యతగా తీసుకున్న ఆంగ్ల మాధ్యమం బడుల్లో , గార్లదిన్నెలో మైనార్టీ విద్యార్థుల ఆంగ్ల మాధ్యమ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోయేలా ఉంది . ఉదయం అయితే తరగతి గదులు.. రాత్రికి పడకగదులుగా మారడం చూస్తుంటే ఇంతకంటే ఘోరం ఎక్కడా లేదన్నారు. బడుల్లో కావలసిన మౌలిక వసతులు క్షేత్రస్థాయిలో అవన్నీ అందుబాటులో ఉన్నాయో లేదో పట్టించుకోని పరిస్థితి నెలకొందన్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు అనంతపురంలో మైనార్టీ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేశారు. ఈ స్కూల్, హాస్టల్ ఏర్పాటుకు అనంత నగరంలో ఎక్కడా భవనాలు లేక అధికారులు గార్లదిన్నెలో నిరుపయోగంగా ఉన్న ఓ భవనంలో మార్చడం జరిగిందన్నారు. జూనియర్ కళాశాల ఏర్పాటుకు భవనం నిర్మించి, అనుమతులు రాకపోవటంతో కళాశాల ఏర్పాటు చేయలేకపోయిన ఈ భవనంలోనే మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల పెట్టాలని నిర్ణయించారు అన్నారు. . జిల్లా కేంద్రంలో ఉండాల్సిన ఈ పాఠశాలను గార్లదిన్నెలో పెట్టిన అధికారులు కనీస సౌకర్యాలు కల్పన చేయకపోవటంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి, అంటువ్యాధులకు గురై నానా ఇబ్బంది పడుతున్నారు. త్వరలో ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్తామన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ విషయం పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఈ -మెయిల్ ద్వారా మౌలిక వసతులు కూడిన ప్రభుత్వ మైనారిటీ హాస్టల్ భవనాన్ని నిర్మించాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అల్లి పిరా , అధ్యక్షులు చాంద్ బాషా, హాజీ వలి , ,సద్దాం తదితరులు పాల్గొన్నారు .

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు