Thursday, February 13, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయియుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత సేవలు

యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత సేవలు

విశాలాంధ్ర ధర్మవరం: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ ధర్మవరం జోన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు, అన్ని విభాగాల ఉద్యోగులకు యుటిఎఫ్ ధర్మవరం జోన్ తరపున ఉచితంగా అందించే సేవలను యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరం జోన్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు 2024 – 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ టాక్స్ (ఐటీ)రిటర్న్స్ ఉచితంగా చేసి ఇవ్వబడునని, అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ ఆన్లైన్ అప్లోడ్, ఉపాధ్యాయుల టి ఐఎస్, జెట్ పి పి జెడ్,
జిపిఎఫ్ మొదలైన అన్ని రకాల ఆన్లైన్ సర్వీసులు పూర్తిగా ఉచితంగా సంఘాలతో నిమిత్తం లేకుండా అందించబడునని తెలిపారు. ధర్మవరం పట్టణంలో టిఆర్టి వీధిలోని స్థానిక యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఈ సదుపాయం నిర్వహించబడునని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా నాయకులు రామకృష్ణ నాయక్, ధర్మవరం జోన్ యుటిఎఫ్ నాయకులు ఆంజనేయులు, అమర్ నారాయణరెడ్డి, సకల చంద్రశేఖర్, హెచ్. రామాంజనేయులు, ఎం. వెంకట కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు