— జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్
విశాలాంధ్ర- అనంతపురం : ప్రజలకు సేవ చేయడంలో పోలీసు ఉద్యోగానికి మించింది లేదని
జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో
ఖాదర్ బాషా, ఎస్సై, ఒన్ టౌన్, అనంతపురం, ముస్తఫా, ఆర్.ఎస్.ఐ, జిల్లా ఏ.ఆర్ విభాగం, అనంతపురం,
చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్, ఒన్ టౌన్, పోలీస్ సిబ్బందికి పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… సమాజం కోసం వీరంతా సుమారు మూడు నుంచీ నాలుగు దశాబ్దాలు పాటు సేవలందించి జీవితాలను పునీతం చేసుకున్నారన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా ముగించడం ముదావహమన్నారు. పోలీసుశాఖలో చిన్న ఉద్యోగంతో జీవితం ప్రారంభించి ఎస్ ఐ ఉద్యోగం వరకు ఎదగడం హర్షణీయమన్నారు. శేష జీవితంలో కూడా ఉల్లాసంగా జీవించేలా వాకింగ్ , తదితర అలవాట్లను పాటించాలన్నారు. పిల్లల భవిష్యత్తుకు దోహదపడాలని కోరారు. అనంతరం పదవీ విరమణ పొందిన సిబ్బందికి సన్మానం చేశారు. పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. బహుమానాలు అందజేసి శేష జీవితం సుఖంగా, ఆనందంగా గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు డి.వి.రమణమూర్తి (పరిపాలన), ఇలియాజ్ బాషా (ఏ.ఆర్ ), డిటిసి డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి, ఆర్ ఐ లు మధు, రాముడు, జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలన అధికారి శంకర్, సూపరింటెండెంట్లు ప్రసాద్, సావిత్రమ్మ, ఎస్పీ సిసి ఆంజనేయ ప్రసాద్, పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, లక్ష్మినారాయణ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.