విశాలాంధ్ర – నిడదవోలు : విసాస్-ఏపీ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్,నిడదవోలు జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యదర్శి వంగా కృపానంద వరప్రసాద్ మదర్ తెరిసా జాతీయ సేవా పురస్కారం 2025 ను అందుకున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం లోని సి ఆర్ సి ఫంక్షన్ హాల్లో మదర్ తెరిసా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ 17వ వార్షికోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో ఉత్తమ సేవ కనబరిచిన 70మందికి మదర్ తెరిసా జాతీయ పురస్కారము 2025 అందజేశారు. ఇందులో భాగంగా అనేక సంవత్సరాలుగా దివ్యాంగులకు చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి మదర్ తెరిసా జాతీయ పురస్కారం 2025″ పురస్కారంతో ఘనంగా సన్మానించినట్లు ఆ ప్రకటంలో వంగా కృపానంద వరప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుండి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చి నప్పటికీ పురస్కారానికి తనను ఎంపిక చేయడం పట్ల మదర్ తెరిసా ఎడ్యుకేషనల్ సోసైటీ చైర్మన్ డాక్టర్ దిడ్ల కిషోర్,సి ర్ సి రూప శిల్పి ‘డాక్టర్ విక్టరీ వెంకట రెడ్డి,ఆహ్వాన కమిటి మెంబర్లకు ప్రసాదు ధన్యవాదాలు తెలిపారు
మదర్ తెరిసా జాతీయ సేవా పురస్కారం అందుకున్న వంగా
- Advertisement -
RELATED ARTICLES


