Wednesday, December 4, 2024
Homeఆంధ్రప్రదేశ్రేషన్ పరేషాన్…

రేషన్ పరేషాన్…

రేషన్ లేకపోతే పరేషాన్ అయ్యేది పేదలేనా…?

రేషన్ మాఫియా పై ఆధారపడ్డ వారి పరిస్థితి ఏమిటి…?

రేషన్ మాఫియా కదేమిటి..

విశాలాంధ్ర నందిగామ :- రాష్ట్రంలో ఇటీవల పెను దుమారం లేపిన రేషన్ లోడ్ తో వెళ్తున్న షిప్ ను సినీ పక్కిలో సీజ్ చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తుంటే మరోపక్క రేషన్ మాఫియా మాత్రం దానిపై కోపాదృక్కులవుతున్నారు దీనికి ముఖ్య కారణం ఏమంటే రేషన్ పరేషాన్ అనే వాదన భారీగా వినపడుతుంది రాష్ట్రవ్యాప్తంగా ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేసిన తీరును దేశవ్యాప్తంగా కొనియాడుతుంటే రేషన్ మాఫియా మాత్రం బహిర్గతంగా వారి యొక్క ఆగ్రహాలు ప్రవేశ పెట్టకపోయినా లోలోపల తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు బయటకు వదులుతున్నారు రేషన్ మాఫియా ద్వారా చేతులు కలిపినా ప్రతి ఒక్కరూ ప్రస్తుతం దీనిపై చర్చించుకోవడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం రేషన్ మాఫియా నడవడం సర్వసాధారణంగా మారిపోయింది గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన ఏ రాష్ట్రంలోనూ దాన్ని నిలుపుదల చేయగల సత్తా ఎవరిలో లేకుండా పోయింది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇటీవల ఏర్పడ్డ నూతన ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించిన జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డులను నెలకొల్పారు అనే మాత్రం ప్రత్యేకంగా చెప్పవచ్చు ఏది ఏమైనా ఆయన చేసిన పనితీరు వలన దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు హర్షద్వారాలు వినపడుతుంటే రాష్ట్రంలో మాత్రం దానిపై అక్రమ సంపాదనగా ముందుకు సాగుతున్న ఎందరో ఉప ముఖ్యమంత్రి పై శాపనార్ధాలు పెట్టడం జరుగుతుంది రేషన్ ద్వారా సాధారణ ప్రజలకు మేలు జరిగే దానికంటే కూడా అక్రమ సంపాదన ద్వారా రేషన్ మాఫియా నడుపుతున్న వారికి మాత్రం భారీగా నష్టాలు చవిచూసే అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయి రాష్ట్ర నలుమూలల నుండి రేషన్ మాఫియా సేకరించిన పిడిఎఫ్ రైస్ ను కాకినాడ ద్వారా కేంద్ర బిందువు చేసి బయటకు పంపే కార్యక్రమాన్ని గత ప్రభుత్వాలు ఎంతో చాకచక్యంగా మొదలుపెట్టాయి అదే రీతిలో ప్రస్తుత కూటమిలో కూడా నేటి కూటమి ప్రభుత్వంలోని క్రింది స్థాయి నాయకులు కార్యకర్తలు వారి వారి స్థాయిని బట్టి దీనిపై ఆధారపడుతున్న సంఘటనలు లేకపోలేదు కాకపోతే ఇదే వృత్తిగా కొనసాగే ఎక్కువ మంది మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ లో పిడిఎస్ రైస్ కొనుగోలు అమ్మకాలు అద్దాంతరంగా ఆగిపోయాయి అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంఘటనను బట్టి చెప్పవచ్చు..

ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా…?

రేషన్ పరేషాన్ తో ప్రభుత్వంలో ప్రస్తుతం హాట్ హాట్ గా తాగుతున్న పాలన వలన కొన్ని కొన్ని కొత్త కొత్త సూచనలు సలహాలు ప్రభుత్వం ముందు ఉన్నాయనే చెప్పవచ్చు అందులో కొన్ని నగదు పంపిణీ కార్యక్రమం చేస్తే ఎలా ఉంటుంది అనేదానిపై ఇప్పటికే ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నట్లుగా తెలియవస్తుంది ఒక కేజీకి 43 రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంటే అదే రైస్ సాధారణ ప్రజలు 10 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఆ రైస్ ను వాడుతున్నారు ఎక్కువ శాతం మంది ఆ రైస్ ను వెంటనే దళారీ వ్యవస్థ ద్వారా మరల రేషన్ మాఫియా కు చేరుతుందనేది నగ్నసత్యంగా చెప్పవచ్చు కాకపోతే సాధారణ ప్రజలకు చేరేది ఒక కేజీకి 10 రూపాయలు అయితే అక్కడ నుండి కాకినాడ పోర్టు వరకు అక్కడ నుండి ఎక్స్పోర్ట్ పోయి వేరే దేశాలకు వెళ్లే వరకు ఒక కేజీకి 40 రూపాయలు వివిధ చేతుల్లోకి వెళ్తుంది అనేది మాత్రం ప్రస్తుతం చెప్పవచ్చు దీనిపై ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ఆలోచనల తో జరిగిన కలయిక కూడా దీనిపై బలం చేకూరుస్తుంది ఏది ఏమైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెల రేషన్ ద్వారా అందుకున్న బియ్యాన్ని సుమారు 10 శాతం మంది మాత్రమే వాడుతున్నారు మిగిలిన 90 శాతం మంది ప్రభుత్వం వారి ద్వారా లబ్ధి పొంది కేవలం పది రూపాయలకే దళారీలకు అమ్ముకుంటున్న వైనం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ప్రభుత్వం వెనుక నగదు పంపిణీకి మగ్గుచూపితే దీనిపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన ఎందరో కుటుంబాలు వృత్తిపరంగా ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు వారికి సరైన అవకాశాలు కల్పించవలసిన అవసరం కూడా ప్రభుత్వంపై ఉంటుంది…

ప్రభుత్వ లంచగొండి అధికారులకు చెక్ పెట్టవచ్చా…

రేషన్ పరేషాన్ ద్వారా కేవలం రేషన్ మాఫియా మాత్రమే నష్టపోతుంది అనేదానికంటే ఎందరో లంచగొండి అధికారులకు దీని ద్వారా చెప్పవచ్చు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఒక రేషన్ వ్యవస్థ సజావుగా సాగాలంటే స్థానికంగా ఉండే రెవిన్యూ, పోలీస్, రవాణా శాఖలతో పాటు పలు రకాల వ్యవస్థలోనే పలువురు అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా సూచి చూడనట్లు వదిలేస్తేనే ఈ మాఫియా నిత్యకల్యాణం లా కొనసాగుతుంది మరి ఈ సంబంధిత శాఖల అధికారులు అందరూ కూడా సూచి చూడనట్లు వదిలేస్తున్నారు అంటే ముఖ్య కారణం ఏమై ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా వారికి రావలసిన నెలవారీ మాములు బాగానే చేరుతున్నట్లుగా భావించవలసి ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని నగదు రూపంలో పంపిణీ చేస్తే వీరందరికీ చేరవలసిన నెలమములు మాఫియా సభ్యులు అందించలేరు కదా అలా జరిగితే ఆటోమేటిక్గా లంచగొండి అవతారం ఎత్తే ప్రతి అధికారి సజావుగా పనిచేస్తారు కదా అనే వాదనలు కూడా ప్రజల నుండి వినిపిస్తున్నాయి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పై కోట్లాదిమంది సామాన్యులకు మేలు జరిగితే వేలాదిమంది మాఫియా సభ్యులకు మాత్రం నష్టం వాటిల్లటం జరుగుతుందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది మరి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటున్న నాయకులు దీనికి సహకరిస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడవలసి ఉంది….

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు