Homeఆంధ్రప్రదేశ్కాలభైరవ ఆలయానికి వెండి కళ్ళు కోరమీశాలు వితరణ..

కాలభైరవ ఆలయానికి వెండి కళ్ళు కోరమీశాలు వితరణ..

- Advertisement -

పూజారి ధనుంజయ ఆచారి
విశాలాంధ్ర -ధర్మవరం;; పట్టణంలోని వరలక్ష్మి థియేటర్ వద్ద గల శ్రీ స్వయంభు కాలభైరవ స్వామి ఆలయంలోని కాలభైరవునికి, కేశవ నగర్ కు చెందిన పళ్ళ హేమ నరసింహులు, వల్ల సంధ్య దంపతులు స్వామివారికి వెండి కళ్ళు, కూర మీసాలు పూజారి ధనుంజయ ఆచారి కి వితరణ చేశారు. ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ నేటి కాలంలో కాల భైరవుని పూజించిన వారికి సకల దోషాలు వెళ్లి సుఖశాంతులు కలుగుతాయని తెలిపారు. తదుపరి పూజారి ధనుంజయ ఆచారి దంపతులకు కృతజ్ఞతలను తెలియజేస్తూ వారి పేరిటన పూజలు నిర్వహించారు. అంతేకాకుండా ఈ ఆలయంలో ప్రతి శనివారము సాయంత్రం శని దోష నివారణ పూజలు, దీపోత్సవం, కంకర ధారణ కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు. భక్తులు, దాతల సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు