Homeఆంధ్రప్రదేశ్‘ఎన్నికలకు సిద్ధం అవుతా’.. సుప్రీం తీర్పుపై దానం నాగేందర్

‘ఎన్నికలకు సిద్ధం అవుతా’.. సుప్రీం తీర్పుపై దానం నాగేందర్

- Advertisement -

ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సంపూర్ణంగా గౌరవిస్తున్నానని తెలిపారు. చట్టపరమైన ప్రక్రియ పట్ల ఉన్న గౌరవంతోనే తాను న్యాయపోరాటం చేశానని చెప్పారు. ఇక తన భవిష్యత్తును ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. నికోర్టు తీర్పు ఇలా వస్తుందని ముందే ఊహించాను. అయితే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ నిబంధనల ప్రకారం కొంత ఊరట లభిస్తుందని భావించాను. అందుకే చట్టపరంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను” అని దానం నాగేందర్‌ పేర్కొన్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో తాను సిద్ధంగా ఉన్నట్లు దానం తెలిపారు. ఖైరతాబాద్‌ ప్రజలతో తనకు దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడూ వారికి అండగా ఉన్నానని చెప్పారు. రాబోయే ఉప ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి వారి ఆశీర్వాదం కోరతానన్నారు. ప్రజల మద్దతు తనకే ఉంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ తరఫున ఖైరతాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేశారు. దీనిపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించి ఖైరతాబాద్‌ సీటు ఖాళీ అయినట్లు పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దానం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నేడు అత్యున్నత న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నికకు మార్గం ఏర్పడింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు