విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, వీరవరం గ్రామంలో వీవర్స్ కల్యాణ మండపంలో జనసేన పార్టీ నాయకుడు, పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఆదిమూలం సాయిబాబా & ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 60 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, గట్టి నర్సయ్య, వెలుగుబంటి నాని, ముద్రగడ జెమీ, నాగిరెడ్డి సూర్య రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ మొదటిసారిగా వీరవరంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సాయిబాబా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని మెగాస్టార్ చిరంజీవి పిలుపు మేరకు ఎంతోమంది ప్రాణాలు నిలుపుకోవడం నిజంగా మానవతా దృక్పథం కలిగిన విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవళ్ళ రామ్మోహన్రావు, ప్రత్తిపాటి రామారావు చౌదరి, వట్టికూటి దత్తుడు, మార్గాని ఏడుకొండలు, బొరుసు సుబ్రహ్మణ్యం, తమ్మిశెట్టి ప్రసాద్, బత్తుల రాము, వాసిరెడ్డి బాబి, జనసేన పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వీరవరం జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
- Advertisement -
RELATED ARTICLES


