Homeఆంధ్రప్రదేశ్రాష్టాభివృద్ధిని కాంక్షించే నాయకుడు పవన్

రాష్టాభివృద్ధిని కాంక్షించే నాయకుడు పవన్

- Advertisement -

*  మాజీ ఎమ్మెల్యే టివిఆర్

 విశాలాంధ్ర – తాళ్లపూడి :రాష్ట్రాభివృద్ధి కి మంచి ఆలోచన చేసే నాయకుడు, చరిష్మా గల నాయకుడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని మాజీ ఎమ్మెల్యే, జనసేన  నాయకులు టి.వి.రామారావు పేర్కొన్నారు. తాళ్లపూడి మండలం లోని పలు చోట్ల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించగా ఆయన ముఖ్యతిధిగా హాజరయ్యారు. దీని లో భాగంగా అన్నదేవరపేట లో జనసైనికులు చెవ్వూరి రామ్, బంగార్రాజు ల అద్వర్యం లో చేపట్టిన కార్యక్రమం లో ఎన్డీయే కూటమి   యువనాయకులు అల్లూరి విక్రమాదిత్య తో పాటు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కేకు కటింగ్ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే నాయకులు స్కీం అధ్యక్షులు ముళ్ళపూడి, గన్నిన సత్తిబాబు, బిజెపి నాయకులు బాలకృష్ణ తదితరులు పాల్గొనగా ఎంతో హట్టాహాసంగా జరిగింది. గజ్జరం గ్రామం లో జనసైనికుడు పూల పల్లి బాలకృష్ణ అద్వర్యం లో  చేసిన వేడుకలో పాల్గొన్నారు. అంతకు ముందు పంచాయతీ స్వీపర్లకు పార్టీ గ్రామ అధ్యక్షులు అవుడు కృష్ణ వస్త్రాలు అంధ చేశారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ శేషు పాల్గొన్నారు. కాగా తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామం లో  జనసైనికులు పెండ్యాల ప్రసాద్ అద్వర్యం లో  చేపట్టిన వేడుక లో మాజీ ఎమ్మెల్యే టి.వి.రామారావు ముఖ్య ఆతిధి గా విచ్చేసారు. బల్లిపాడు స్కూలు లో విద్యార్థుల మధ్య జన్మదినోత్సవ వేడుక అనంతరం శుభ దినం భోజనాలు అందించారు. అలాగే స్కూల్ కు ఎలక్ట్రిక్ బెల్ ను జనసైని కులు అందించారు. కాగా అక్కడ పిల్లలు  చేతితో వేసిన ఉపముఖ్యమంత్రి చిత్రాన్ని అవిష్కరించారు. ఆస్కూల్ పిల్లలకు బ్లూ టూత్ కలిగిన కంప్యూటర్ ను అందిస్తానని టి.వి.ఆర్  హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు