విశాలాంధ్ర -నిడదవోలు :అభిమానులను అలరించేందుకు సినిమా రంగాల్లోనూ, కర్షక,కార్మిక, పేదలను ఆదుకునేందుకు రాజకీయ రంగంలోనూ రాణిస్తూ అటు కళామ తల్లికి ఇటు రాజకీయ రంగంలోనూ సేవలందిస్తున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ అన్నారు. మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు జనసేన పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీరంగా సుబ్బారావు సత్యవతి కాపుల కళ్యాణ మండపంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 40 మంది జన సైనికులు,వీర మహిళలు రక్త దానం చేశారు.22 వ వార్డులో పవన్ కళ్యాణ్ పుట్టిన సందర్బంగా వీర మహిళ ధర్మాణి పార్వతి ప్రసన్న ఆధ్వర్యంలోవైఎస్ఆర్ కాలనీ లో అర్బన్ ప్రైమరీ హాస్పిటల్ లో కేక్ కటింగ్చేసి రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో తాడిమళ్లలో శ్రీ చోల్లమ్మ మల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి, అనంతరం కేక్ కటింగ్ చేసారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడు సందర్భంగా శ్రీ కోట సత్తెమ్మ దేవస్థానంలో అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మున్సిపల్ చైర్పర్సన్ భూపతి ఆది నారాయణ, సింగవరం సొసైటీ అధ్యక్షులు పెన్మత్స చందు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, పువ్వల రతీదేవి, గంగుల గోపి యాదవ్ జన సేన నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES


