విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మెరక వీధిలోగల వినాయకుని లడ్డు పాట 96 వేల రూపాయలకు దేవరపల్లి కి చెందిన గంటా వెంకటేశ్వరరావు దక్కించుకున్నారు. వినాయక చవితి మహోత్సవాలు సందర్భంగా దేవరపల్లి కి చెందిన నల్ల స్వామి 55 కేజీల లడ్డూను స్వామివారికి సమర్పించారు. వారం రోజులు పాటు పూజలు జరిగిన అనంతరం సోమవారం రాత్రి మెరక వీధి వినాయక చవితి మహోత్సవాల కమిటీ సభ్యులు వేలం వేశారు. ఈ వేలంలో గంట వెంకటేశ్వరరావు 96 వేల రూపాయలకు పాడి లడ్డూలు దక్కించుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు ఉత్కంఠ భరితంగా పాట జరిగింది. పాటలో ముగ్గురు పాల్గొన్నారు. పాట 40,000 రూపాయల నుండి ఒక్కొక్క వెయ్యి రూపాయలు పెరుగుతూ చివరకు 96 వేల రూపాయలకు గంట వెంకటేశ్వరరావు లడ్డును పాడి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సభ్యులు లడ్డు పాడిన గంట వెంకటేశ్వరరావును సత్కరించారు. అంతకుముందు దేవరపల్లి సీఐ బి నాగేశ్వర నాయక్ మండపాన్ని సందర్శించి ఉత్సవ కమిటీ సభ్యులతో చర్చలు జరిపారు. బుధవారం రోజున పాట సొమ్ము 96 వేల రూపాయలు చెల్లించి లడ్డూను ఊరేగింపుగా తీసుకొని వెళతానని పాటదారుడు గంటా వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెరక వీధి వినాయక ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మాధవరపు వెంకటరమణ కమిటీ సభ్యులు సూరిశెట్టి నాని, సూరిశెట్టి బాలాజీ, మాధవరపు గోపాలకృష్ణ, సూరిశెట్టి రాంబాబు, బుర్ర సీతన్న, ఆకుల నాని, దుగ్గిన గంగాధరరావు నాయుడు, కంబాల సత్తిబాబు, జాజిమొగ్గల శ్రీనివాస్, మాధవరపు వెంకటేశ్వరరావు, కోట సత్యనారాయణ, వినాయకుడి ఆలయ కమిటీ సభ్యులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
96 వేల రూపాయల కు లడ్డు దక్కించుకున్న గంటా
- Advertisement -
RELATED ARTICLES


