రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ..
రాష్ట్ర క్యాబినెట్ స్థాయి గుర్తింపునిచ్చిన కూటమి ప్రభుత్వం.
నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు.
విశాలాంధ్ర – కొవ్వూరు : ఆయన ఒకప్పుడు సాధారణ మాస్టర్.. ఇక ఆయన కుటుంబ నేపథ్యం చూస్తే స్వాతంత్ర సమరయోధుల నేపథ్యం.. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా జీవనాన్ని ప్రారంభించిన ఆయన నిరంతర శ్రామిక వాది.. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా తన ఉద్యోగ జీవితంలో పోరాటం ప్రారంభించారు. అది కూడా ఉపాధ్యాయ రంగానికి ప్రభుత్వాల నుంచి అందాల్సిన హక్కుల కోసం తన గళం విప్పారు. ఆ గళం కాస్తా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ ( ఏపీటీఎఫ్ ) యూనియన్కు, మండల స్థాయి నాయకుడిగా ప్రారంభమైన ప్రస్థానం జిల్లా స్థాయి ఆపై రాష్ట్ర స్థాయి వరకు చేరింది. ఈ పోరాటాలలో ఎన్నో విజయాలు సాధించారు కూడా.. ఈ నేపధ్యమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఆయనలోని పోరాట తత్వం మరోసారి ఉబికి వచ్చింది. దాని ఫలితమే సమైక్యాంధ్ర ఉద్యమం కోసం కొవ్వూరులో అనేక రోజులు నిరాహాదీక్షకు సైతం దిగి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ పోరాట ఫలితాలతో నాయకుడిగా తయారైన జవహర్ మాస్టర్ను కొవ్వూరు నియోజకవర్గం టిడిపి లోకల్ నాయకత్వం తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి కొవ్వూరు నియోజకవర్గం సీటు నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందిగా కోరటం, అధినేత చంద్రబాబు ఒప్పకోవడం ఏకకాలంలో జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో జవహర్ కొవ్వూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం సుమారు 15 రోజుల వ్యవధిలో ప్రచారం నిర్వహించి భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. ఎమ్మెల్యే స్థాయి నుంచి క్యాబినెట్ మంత్రిగా ప్రస్థానం.. 2014లో ఎమ్మెల్యేగా విజయంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జవహర్ తర్వాత వచ్చిన పుష్కరాల సమయంలో నిరంతరం శ్రమ పడుతూ పుష్కరాలను తనదైన శైలిలో విజయవంతం చేశారు. దీంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు జవహర్ పనితనాన్ని మెచ్చుకొని ఆయనకు క్యాబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇటు మంత్రి పదవిలోనూ విజయాలు సాధిస్తూ వచ్చారు. రాజకీయ జీవితంపై క్రీ నీడ.. 2019 వరకు రాజకీయాల్లో అప్రతి హాసంగా దూసుకుపోతున్న జవహర్ రాజకీయ జీవితంపై క్రీ నీడ పడింది. అయినా ఆయన ఇప్పుడు నిరాశ పడలేదు. పార్టీ అధిష్టానం ఏ ఫిలిపునిచ్చిన తన వంతు పాత్ర నిర్వహించేవారు. జిల్లాలు విడిపోయిన నేపథ్యంలో తూర్పుగోదావరి కి టిడిపి అధ్యక్షనిగా పని చేస్తూ జిల్లా అంతా కలియ తిరుగుతూ పార్టీని ఒక త్రాటిపై నిలిపి తనదైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. 2024 లో కొవ్వూరు నుంచి టిడిపి తరపున టికెట్ ఆశించిన కొన్ని అనివార్య కారణాలవల్ల సీటు దక్కలేదు. ఇక జవహర్ రాజకీయ జీవితం అయిపోయిందలే అనుకుని సంబరపడ్డ ఆయన ప్రత్యర్థులకు గొంతులో వెలక్కాయ పడింది. అదే జవహర్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఎంపిక అవ్వటం ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అధికార కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా చంద్రబాబు ఆశీస్సులతో ఆయనకు క్యాబినెట్ ర్యాంకు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జీవో కూడా విడుదల అయింది. ఈ నేపద్యంలో ఆయన అనుచరులు కార్యకర్తలు, నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఆయన అభిమానులు వర్షాతిరేఖలను వ్యక్తం చేస్తూ పండుగ జరుపుకున్నారు.


