Homeజిల్లాలుఅనంతపురంఖాతాదారుల సేవ కేంద్రం ప్రారంభం

ఖాతాదారుల సేవ కేంద్రం ప్రారంభం

- Advertisement -

విశాలాంధ్ర బొమ్మనహళ్.. మండలంలోని నేమకల్లు గ్రామంలో హీరేహాల్ భారతీయ స్టేట్ బ్యాంక్ పరిధిలో ఖాతాదారుల సేవ కేంద్రం ను బ్రాంచ్ మేనేజర్ రాజేష్ శుక్రవారం ప్రారంభించారు. ఖాతాదారుల సేవ కేంద్రం కు సి ఎస్ పి గా కురుబవసంత్ కుమార్ ను నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ స్టేట్ బ్యాంకు పరిధిలో ఖాతాదారులు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్రమును ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఖాతాదారులకు సీఎస్పీఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరమేశ్వర, గాలి బసప్ప, బెల్లి హనుమంతు రెడ్డి, శంకర్, భీమప్ప, గ్రామ ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు