ఇజ్రాయిల్‌కు చైనా సూచన: దోహాపై దాడులకు ఖండన
బీజింగ్: ఇజ్రాయిల్ యుద్ధోన్మాదంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెంచే విధంగా ఇజ్రాయిల్ ముందుకెళుతుండటాన్ని ఆక్షేపించింది. ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరపడాన్ని బుధవారం చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండిరచింది. ఖాతార్ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని అతిక్రమించేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నించిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ వెల్లడిరచారు. ‘సంబంధిత పక్షాలు ముఖ్యంగా ఇజ్రాయిల్ శాంతించాలి. ఘర్షణలను ఆపే దిశగా సానుకూల కసరత్తు చేయాలి. చర్చలను పునరుద్ధరించాలి. దాడులకు పాల్పడవద్దు’ అని ఆయన పేర్కొన్నారు. కాల్పుల విరమణలో నిర్మాణాత్మక పాత్రను ప్రత్యేకించిన కొన్ని శక్తులు పోషించాలని అమెరికా పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. ప్రాదేశిక ఘర్షణలను పరిష్కరించాలని కోరారు. పశ్చిమాసియా సమస్యలపై బాహ్య శక్తుల (అమెరికానుద్దేశించి) అసమతుల్యమైన వైఖరి వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొన్నదన్నారు. దోహాపై వైమానిక దాడి ద్వారా హమాస్ రాజకీయ నాయకుల హత్యకు ఇజ్రాయిల్ ప్రయత్నించింది. అమెరికా అండతో పశ్చిమాసియాలో దురాక్రమణను మరింత విస్తృతం చేస్తోంది. ఇదిలావుంటే ఇజ్రాయిల్ దాడులకు సంబంధించిన ప్రతి అంశంపై తాను చాలా సంతోషంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడిరచారు. ఇజ్రాయిల్ దాడుల గురించి ఖతార్‌కు సమాచారం ఇచ్చినట్లు అమెరికా వర్గాలు తెలిపాయి. అయితే దాడులు మొదలైన పది నిమిషాల తర్వాతగానీ తమకు అమెరికా నుంచి ఫోన్ రాలేదని ఖతార్ వెల్లడిరచింది.
ఉద్రిక్తతలు పెంచవద్దు
- Advertisement -
RELATED ARTICLES


