Homeజాతీయంలగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ కేసు.. దుల్కర్‌, పృథ్వీరాజ్‌ ఇళ్లలో కస్టమ్స్‌ దాడులు

లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ కేసు.. దుల్కర్‌, పృథ్వీరాజ్‌ ఇళ్లలో కస్టమ్స్‌ దాడులు

- Advertisement -

మ‌ల‌యాళ స్టార్ న‌టులైన దుల్క‌ర్ స‌ల్మాన్ , పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఇళ్ల‌ల్లో క‌స్ట‌మ్స్ అధికారులు అక‌స్మిక దాడులు చేశారు. లగ్జరీ కార్ల అక్రమ రవాణా (స్మగ్లింగ్) ఆరోపణలకు సంబంధించిన కేసులో భాగంగా ఈ దాడులు జరిగాయి. ాఆపరేషన్ నమకూర్్ణ పేరుతో దేశవ్యాప్తంగా లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌పై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే కేరళలోని పలువురు ప్రముఖుల నివాసాల్లో సోదాలు జరిగాయి. కోచి, తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లతో పాటు పనంపిల్లి నగర్‌లోని దుల్కర్ సల్మాన్ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే వారి వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ల‌గ్జ‌రీ వాహనాలు లభించలేదని క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపిన‌ట్లు స‌మాచారం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు