- Advertisement -
విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు గ్రామానికి చెందిన నరేంద్ర (40) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసగా మారిన నరేంద్ర మంగళవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఉరవకొండ పోలీసులు తెలిపారు. నరేంద్రకు కొడుకు, కూతురు, భార్య ఉన్నారని ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


