విశాలాంధ్ర- ధర్మవరం; పట్టణంలోని స్థానిక కె హెచ్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం, విభాగాధిపతి, డా. బి.గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇంచార్జి- ప్రిన్సిపాల్ డా.ఎస్.చిట్టెమ్మ, అధ్యక్షత వహించారు. అనంతరం చిట్టెమ్మ, షమీవుల్లవారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతు డా.బి.ఆర్.అంబేద్కర్ నుండి ప్రపంచంలో ఎవరికి హానితలపెట్టలేదని, భారతదేశ ప్రజలు విద్యా, సామాజిక, అర్థిక, రాజకీయంగా అభివృద్ధి చెందడానికి అహర్నిశలు కృషి చేశారని, తన కుటుంబాన్ని త్యాగం చేసిన మహానుభావుడని గుర్తు చేస్తు మనం కూడా అంబేద్కర్ గారి ఆశయ, లక్ష్యాలు ను ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేసారు. ప్రస్థుతం పిల్లల మీద బీమా తల్లి తండ్రులు చేస్తున్నారనీ, కానీ అంబేద్కర్ తన పుస్తకాలు మీద ఇన్సూరెన్స్ చేసేవారని , విద్యకు చాల ప్రాధాన్యత ఇచ్చెవారని గుర్తు చేస్తు, మీరు కూడా ఆ విధానాన్ని పాటిస్తూ ఉన్నత ఆదర్శాలను పెంపొందించుకొని నడుచుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. ఎం.భువనేశ్వరి, ఎ.కిరణ్ కుమార్, ఎస్.పావని, పుష్పవతి, సరస్వతి, మీనా, బి. ఆనంద్, హైమావతి తదితర అధ్యాపక, అధ్యాపకేతర బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కు ఘన నివాళి… ఇంచార్జ్ ప్రిన్సిపాల్ చిట్టెమ్మ
RELATED ARTICLES