Homeజిల్లాలువిజయనగరండాక్టర్ తలే రాజేష్ పరామర్శ

డాక్టర్ తలే రాజేష్ పరామర్శ

- Advertisement -

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం టౌన్ పరిధి కొండంపేట వార్డుకు చెందిన వైఎస్ఆర్సీపీ రాజాం టౌన్ పార్టీ ఉపాధ్యక్షులు ముద్దాన సత్యారావు బావ బావిశెట్టి శ్రీనివాసరావు ఇటీవ‌ల మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే రాజేష్ వ్యక్తిగతంగా వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.డా. రాజేష్ ఈ సందర్భంగా మరణించిన శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒక కుటుంబ సభ్యుల్లా ఉండి సుఖదుఃఖాలలో భాగస్వాములు కావడం వైఎస్ఆర్సీపీ ఆత్మస్ఫూర్తి అని అన్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, పబ్లిసిటీ విభాగం అధ్యక్షులు ఆశపు సూర్యం, జిల్లా కల్చరల్ విభాగం అధ్యక్షులు డా. బి. నరేంద్ర, ముద్దాన నాగరాజు, నాగిరెడ్డి ప్రకాశరావు, వెంపల ప్రసాద్, మొగలి మన్మధరావు, సలాది బాలకృష్ణ, టొంపల శ్రీను, నాగిరెడ్డి శ్రీనివాసరావు, ముద్దాన అన్నారావు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పార్టీ నాయకులు మాట్లాడుతూ డా. తలే రాజేష్ ప్రజలతో కలసి ఉండే నాయకుడని, ప్రతి సంతోషం–విషాద సమయంలో కూడా ప్రజలతో కలిసి నడుస్తున్నారని తెలిపారు. ఆయన చూపిస్తున్న మానవతా దృక్పథం ప్రతి కార్యకర్తకు ఆదర్శమని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు