Homeఆంధ్రప్రదేశ్ఉపాధి హామీ పథకం పనుల గుర్తింపు గ్రామ సభ

ఉపాధి హామీ పథకం పనుల గుర్తింపు గ్రామ సభ

- Advertisement -

విశాలాంధ్ర – సీతానగరం: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను గుర్తించే విధంగా రెండు గ్రామాల్లో గురువారం గ్రామ సభ నిర్వహించారు. మండలంలో ములకల్లంక గ్రామ పంచాయతీలో ఏ పి ఓ సత్యవతి, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలో ఈ సి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం గ్రామ సభలు జరిగాయి. దీనిలో ములకల్లంక గ్రామ పంచాయతీలో 5 పంట కాలువలు, 3 సోక్ పిట్లు, 5 కంపోస్ట్ పిట్లు, 2 మట్టి రోడ్డు నిర్మాణం పనులు, రోడ్డు కిరువైపులా మొక్కలు పెంచే పనులు 2 గుర్తించడం జరిగింది. పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలో  20 పంట కాలువలు, 2 పెద్ద కాలువలు, కేనాల్ ప్లాంటేషన్ 1, మట్టి రోడ్డు నిర్మాణం పనులు 2, కంపోస్ట్ పిట్లు 2 గుర్తించడం జరిగింది అని అన్నారు. అలాగే  జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ వెరిఫికేషన్ కచ్చితంగా చేయించుకోవాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఉపాధి హామీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు