రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ కిట్లు ద్వారా పరీక్షలు..
అప్పటికప్పుడే ఫలితాలు వెల్లడి..
విశాలాంధ్ర – కొవ్వూరు : రాష్ట్రాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు, సేకరణకు కళ్లెం పడనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ తమ శాఖ పరిధిలో పలు సంస్కరణలను అమల్లోకి తెస్తోంది. ఇప్పటికే రేషన్ కార్డులకు క్యూఆర్ కోడ్ జతపరిచి బియ్యం పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నించింది. అదేవిధంగా రేషన్ డీలర్లకు కొత్త ఈ పోస్ యంత్రాలను అందించి పారదర్శకతకు పెద్దపీట వేసింది. ఇప్పుడు సివిల్ సప్లైస్ లోని డిప్యూటీ తాసిల్దారులకు టెక్నికల్ అసిస్టెంట్లకు మొబైల్ పరీక్ష పరికరాలను అందజేసింది. జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరిధిలో ఐదు లక్షల 43 వేల తెల్ల కార్డులు ఉన్నాయని, అదేవిధంగా 20వేల 67 ఏ ఏ ఓ కార్డులు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. దీనిలో భాగంగా జిల్లాలో 15 పీఎస్ డి టి లకు మరో 15 టెక్నికల్ అసిస్టెంట్లకు అందజేసింది. ఈ కిట్లద్వారా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నప్పుడు గానీ రవాణా చేస్తున్నప్పుడు గాని అప్పటికి అప్పుడు పరీక్షలు నిర్వహించి అది రేషన్ బియ్యం అవునా కాదా అన్న విషయాన్ని వెంటనే కనిపెట్టవచ్చు. గతంలో అయితే ఈ తతంగమంతా పట్టుకున్న బియ్యాన్ని శాంపిల్ రూపంలో జిల్లాస్థాయి ల్యాబ్ లకు పంపటం అక్కడ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చేవరకు సివిల్ సప్లై అధికారులు వేచి చూసేవారు. ఇప్పుడు ఈ కిట్ల ద్వారా ఫలితాలు వెంటనే రావడంతో చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు వెసులుబాటు లభిస్తుంది. ఈ కిట్లలోని ఉన్న రసాయనంలో బియ్యాన్ని వేస్తే అవి ఎరుపు రంగులో మారుతాయి అని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్ ద్వారాను, కొత్త ఈ పోస్ కొత్త యంత్రాల ద్వారా వేలిముద్రల సేకరణ, వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ ను అందుకుంటున్నామని, ఇప్పుడు ఈ మొబైల్ కిట్ల ద్వారా మరింత ఫలితాలు సాధిస్తామని పౌరసరపాల శాఖ అధికారులు చెబుతున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ సివిల్ సప్లై అధికారులూ..


