Homeఆంధ్రప్రదేశ్మైన‌ర్ బాలికపై  అత్యాచారం  కేసులో నిందితుల అరెస్టు

మైన‌ర్ బాలికపై  అత్యాచారం  కేసులో నిందితుల అరెస్టు

- Advertisement -

విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటి ; ఈ నెల 20వ తేదీ స్థానిక గ‌ణేష్ చౌక్ లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఓ మైనర్  బాలిక‌ను బ‌య‌ట‌కు తీసుకెళ్ళి అత్యాచారం చేసిన ఘ‌ట‌న‌లో నిందితులను అరెస్టు చేసిన‌ట్లు సౌత్ జోన్ డిఎస్ పి శ్రీమ‌తి భవ్య కిశోర్ చెప్పారు. గురువారం మ‌ధ్యాహ్నం స్థానిక రెండ‌వ ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్‌లో  ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ కేసుకు సంబందించి ఏ1 పాము అజ‌య్‌, ఏ2 కాగిత‌ప‌ల్లి స‌త్య‌స్వామిల‌ను రాజమహేంద్రవరం  రైల్వే పార్సిల్ ఆఫీసు ఎదురుగా అనుమానాస్పదంగా తిరుగుతుండగా
అరెస్టు చేసిన‌ట్లు చెప్పారు. ఈ కేసును 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే చేధించి నిందితుల‌ను అరెస్టు చేసిన ఇన్ స్పెక్ట‌ర్ పి. శివ‌గ‌ణేష్‌, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్   టిఎన్ విఎస్  శ్యాం సుందర్ ,  హెచ్ సి. బిఎంవివి  భానుమూర్తి, కానిస్టేబుళ్ళు ఎస్‌.కె.  రబ్బాని, పి.. మహేష్ కుమార్, యు. నాగబాబు, కె. బాల సుబ్రహ్మణ్యంలను ఆమె ఈ సంద‌ర్భంగా అభినందించారు. ఈ కేసు నమోదు అయిన వెంటనే పట్టణంలో ఉన్న అన్ని  బాలికల వసతి గృహాల  నిర్వాహకులకు తగిన సూచనలు ఇవ్వమని సంబంధిత  అధికారులకు తెలియచేయటం జ‌రిగింద‌ని,  శక్తి  టీం లను అన్ని బాలికల వసతి గృహాల ద‌గ్గ‌ర‌కి   పంపి వారికి అవగాహన కల్పిస్తామ‌న్నారు. అలాగే, మైనర్ బాలురు, బాలికలకు రూములు ఇవ్వవద్దని  లాడ్జి ఓన‌ర్ల‌ను హెచ్చ‌రించామ‌ని, స‌ద‌రు లాడ్జి మీద త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా సంబందిత అధికారుల‌కు తెలియ చేశామ‌న్నారు.  నిందితుల‌ను అత్యంత చాకచ‌క్యంతో అరెస్టు చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్‌.పి. డి.న‌ర‌సింహ కిశోర్ కూడా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు