Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅన్ని దానాల కన్నా అన్నదానం మిన్న

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న

- Advertisement -

శ్రీ సత్య సాయి సేవ సమితి -2 నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం;; అన్ని దానముల కన్నా అన్నదానం మిన్న అని సుబ్బదాసు భజన మందిరం, పిఆర్టి సర్కిల్, శ్రీ సత్య సాయి సేవ సమితి -2 నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు భజన మందిరంలో దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత వైద్య శిబిరమును నిర్వహించి 700 మందికి ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సేవాదాతగా పుట్టపర్తి కు చెందిన ఇంజనీర్ శ్రీధర్, జోహాన్ వ్యవహరించడం పట్ల వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలను దాము పుట్టపర్తి బాబా ఆశీస్సులతో, సేవాదాతల సహకారంతో నిర్వహించడం మాకెంతో తృప్తిని, సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు