Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరైళ్లలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి..

రైళ్లలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి..

- Advertisement -

టూ టౌన్ సి ఐ.రెడ్డప్ప

విశాలాంధ్ర ధర్మవరం;; రైళ్లలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని టూ టౌన్ సి ఏ రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు రైల్వే స్టేషను పరిసర ప్రాంతములలో వారు తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను తనిఖీ చేసి అందరికీ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ రైలు ప్లాట్ఫారం నందు గాని, రైళ్లలో గాని ఎవరైనా అనుమానంగా అగుపడితే వెంటనే డైల్ 100 కు ఫోన్ చేయాలని తెలిపారు. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకోరాదని, విలువైన వస్తువులు, నగలు, పెద్ద మొత్తంలో నగదును రైళ్ల ప్రయాణంలో పోరాదని తెలిపారు. రైళ్ల ప్లాట్ఫారంలలో ఎవరైనా అనుమానితులు గాని, ఏదైనా సహాయం అడిగితే జాగ్రత్తగా మసులుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు