Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై ఈనెల 28న ర్యాలీలు జయప్రదం చేయండి..

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై ఈనెల 28న ర్యాలీలు జయప్రదం చేయండి..

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజక కేంద్రాలలో ఈనెల 28వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ ర్యాలీని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారి స్వగృహంలో నియోజకవర్గ వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పోస్టర్లను వారు విడుదల చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే సామాన్య ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని, పేద విద్యార్థులకు విద్య అందదు అని వారు స్పష్టం చేశారు. నేటి ఎన్డీఏ ప్రభుత్వం వివిధ పథకాలు, ప్రజలను ఎన్నో ఇక్కట్లకు గురిచేస్తోందని తెలిపారు. అభివృద్ధి అన్న పథకానికి అర్థం ఉండేలా చూడాలని తెలిపారు. కావున నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు, ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాలలో ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు