విశాలాంధ్ర – నిడదవోలు : జారిపడి కాలుకు గాయం కావడంతో ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జీ.సురేష్ భార్య సుబ్బలక్ష్మిని ,నిడదవోలు స్వాతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎండీ ఇస్మాయిల్ ఖాన్ ను, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎండీ షాజహాన్ సోదరుడి కుమారుడు జవహర్ ఇటీవల రోడ్డు ప్రమాదం లో మృతి చెందడంతో జవహర్ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్,మాజీ శాసనసభ్యులు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు, స్థానిక 7వ వార్డు వడ్డీల వీధి నందు ఇటీవల మరణించిన పట్టణ టిడిపి నాయకులు త్రిపత్తి వీర్రాజు అన్నయ్య త్రిపత్తి పుల్లయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను శేషారావు పరామర్శించారు. ఆయన వెంట టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మిన వెంకటేశ్వరరావు, తిరుపతి సత్యనారాయణ, టిడిపి నాయకులు పాల్గొన్నారు
పలువురుని పరామర్శించిన బూరుగుపల్లి శేషారావు
- Advertisement -
RELATED ARTICLES


