విశాలాంధ్ర -ధర్మవరం : ఇటీవల కర్నూల్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ అనుకోకుండా ప్రమాదానికి గురై బస్సు పూర్తిగా కాలిపోయే సమయంలో ధర్మవరానికి చెందిన హరీష్ కుమార్ రాజు, స్నేహితుడు జానేంద్ర వంశీలను వారి ఇంటికి వెళ్లి ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మీసేవ తపన సమాజానికి ఆదర్శమయిందని, మానవత్వం ముందు భయం జయించిన ధర్మారం యువత అని వారు ప్రసర్శించారు. ప్రయాణికుల ప్రాణాల కోసం ప్రాణాలను పణంగా పెట్టడం నిజంగా అభినందనీయమని తెలిపారు. మీవంటి యువతే దేశముకు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. పదిమందికి పైగా ప్రయాణికులను ఆ సమయంలో కాపాడటం నిజంగా అభినందించదగ్గ విషయం అన్నారు. అందుకే మీ ధైర్య సాహసాన్ని తాను ప్రశంసిస్తూ సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నానని వారు తెలిపారు. మీ మానవత్వానికి ధైర్యానికి ప్రతీకగా నేడు దేశంలో నిలిచిందని తెలిపారు.
కర్నూల్ బస్సు ప్రమాదంలో ప్రాణాలను రక్షించిన ధర్మారం యువకులకు ఘనంగా సన్మానం
- Advertisement -
RELATED ARTICLES


