Homeజిల్లాలుశ్రీ సత్యసాయిక్రీడా సామాగ్రిని అందజేసిన బిజెపి జిల్లా కార్యదర్శి డోల రాజారెడ్డి

క్రీడా సామాగ్రిని అందజేసిన బిజెపి జిల్లా కార్యదర్శి డోల రాజారెడ్డి

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గత కొన్ని సంవత్సరాలుగా క్రికెట్ క్రీడాకారులు తమకున్న స్తోమత ప్రకారం క్రికెట్ ఆట ఆడుకుంటూ ఉండేవారు. కానీ సరి అయిన, నాణ్యత కలిగిన క్రికెట్ క్రీడా సామాగ్రి లేకపోవడంతో ఎంతో నిరుత్సాహానికి గురయ్యేవారు. దీంతో బిజెపి జిల్లా కార్యదర్శి డోల రాజారెడ్డి తనవంతుగా క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 30 వేల రూపాయలు విలువ చేసే క్రీడా సామాగ్రిని క్రికెట్ క్రీడాకారులకు అందజేశారు. అనంతరం డోలా రాజారెడ్డి మాట్లాడుతూ మన ధర్మారం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడమే కాకుండా క్రీడల పట్ల కూడా ఎంతో శ్రద్ధతో ఉన్నారని, వారి సూచనల మేరకు తనవంతుగా, ఒక క్రీడాకారునిగా ఈ క్రీడా సామాగ్రిని ఇవ్వడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అనంతరం క్రికెట్ క్రీడాకారులు డోలా రాజారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు