యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, జయరాం
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రజలందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎంతో అవసరము అని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వంకదారి మోహన్, క్యాంపు చైర్మన్లు పోలా ప్రభాకర్, షేక్ చాంద్బాషా తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ఉచిత మెగా వైద్య శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ మెగా వైద్య శిబిరమునకు దాతగా కీర్తిశేషులు డాక్టర్ సింగనమల నాగమణి జ్ఞాపకార్థం, యువర్స్ ఫౌండేషన్, కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 251 మందికి 15 రోజులకు సరిపడు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవి, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బివి. సుబ్బారావు, జనరల్ ఫిజీషియన్ వీరభద్రయ్య, దంత వైద్య నిపుణులు డాక్టర్ మనోజ్ కుమార్, ఎముకలు కీళ్ల వైద్య నిపుణులు భాను కిరణ్, జనరల్ సర్జన్ డాక్టర్ కొండయ్య, ఆప్తల ఆప్తాలమిక్ అసిస్టెంట్ షేక్ సికిందర్ పాల్గొని రోగులకు వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. అవసరమైన వారికి వివిధ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించామని తెలిపారు.యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా తాము నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్సి గుప్తా, గర్రె రమేష్ బాబు, వై కే శ్రీనివాసులు, ఆర్వి. నాగార్జున, సికే రామాంజనేయులు, కౌన్సిలర్, సమాజ సేవకుడు కేతాలోకేష్, ఆర్కే రాధాకృష్ణ, కోటేశ్వరరావు, శివ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎంతో అవసరం..
- Advertisement -
RELATED ARTICLES


