Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు వైద్య చికిత్సలు అందించడంలో ఎంతో సంతృప్తి ఉంది..

పేద ప్రజలకు వైద్య చికిత్సలు అందించడంలో ఎంతో సంతృప్తి ఉంది..

- Advertisement -

అధ్యక్షులు బి వి.రమణ
విశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజలకు వైద్య చికిత్సలు అందించడంలో ఎంతో సంతృప్తి సంతోషం లభిస్తుందని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బి.వి రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కార్యదర్శి దాసరి వెంకటేశులు (చిట్టి) సూచనల మేరకు పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 115వ ఉచిత వైద్య చికిత్స శిబిరము నిర్వహించారు. అనంతరం అధ్యక్షులు బివి రమణ మాట్లాడుతూ ఈ వైద్య చికిత్స శిబిరం గత కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తున్నామని, దాతర సహాయ సహకారాలతో ఇది విజయవంతం కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. నేటి శిబిర దాతగా శీలం సావిత్రమ్మ, శీలం శ్రీ రాములు, వారి కుమారుడు శీలం రమ్య నాగిని, శీలం జయప్రకాష్ కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల ఆలయ అభివృద్ధి సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరంలో 312 మంది రోగులకు డాక్టర్ల ద్వారా మంచి వైద్య సికిస్ల తో పాటు ఒక నెలకు సరిపడు మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో దంత వైద్యులు- డాక్టర్ వివేక్ కుళ్ళాయప్ప, డాక్టర్ ఎస్ విట్టల్, చిన్నపిల్లల వైద్య నిపుణులు- డాక్టర్ వెంకటేశ్వర్లు, గ్యాస్ట్రో అండ్ లాప్రోస్ క్లిప్ సర్జన్ హైదరాబాద్ వారి డాక్టర్. జై దీపు నేత, ఎముకల వైద్య నిపుణులు- డాక్టర్ సతీష్ కుమార్, చెస్ట్ నిపుణులు డాక్టర్. ప్రణయ్ రోగులకు వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్య పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరివెళ్ల రాధాకృష్ణ, బండి నాగరాజు, పెద్దకోట్ల భాస్కర్ ,డాక్టర్ వినయ్, అశ్వర్థ నారాయణ ,విజయ్, మేకల శివయ్య, నారాయణస్వామి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు