ధర్మవరం ఎస్బిఐ రీజినల్ మేనేజర్ శశిధర్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పరిశుభ్రత ఉన్నప్పుడే మంచి ఆరోగ్యం లభిస్తుంది అని భారతీయ స్టేట్ బ్యాంక్ రీజినల్ బిజినెస్ కార్యాలయం రీజినల్ మేనేజర్ డి.శశిధర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు “ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 6.0.. స్వచ్ఛతసే స్వచ్ఛతకి ఓట్”అన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వారు పట్టణంలోని పలు కూడలిలో మొత్తం ధర్మవరం పరిధిలోని ఎస్బిఐ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పరిశుభ్రత నుంచి ఆరోగ్యం వైపు ఎలా ఉండాలి? అన్న అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం రీజినల్ మేనేజర్ శశిధర్ కుమార్ మాట్లాడుతూ నేటి సమాజంలో పరిశుభ్రత పట్ల ప్రజలకు చక్కటి అవగాహన కల్పించినప్పుడే ఆరోగ్యం వైపు అందరూ వెళ్లగలుగుతామని తెలిపారు. ఈ కార్యక్రమం అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈనెల 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలతో చేపడటం జరుగుతుందన్నారు. మొత్తం సత్యసాయి జిల్లాలో 41 ఎస్బిఐ శాఖల ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి చుట్టుపక్కల గల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యం తప్పక లభిస్తుందని వారు స్పష్టం చేశారు. కావున ప్రజలు కూడా పరిశుభ్రతను తప్పక పాటించి ఆరోగ్యమును బదిలంగా ఉంచుకోవాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్లు వైవి నాయుడు, రాంప్రసాద్, హెచ్ఆర్ మేనేజర్ దస్తగిరి తోపాటు ధర్మవరం పరిధిలోని ఎస్బిఐ శాఖ ఎస్బిఐ ఉద్యోగులు పాల్గొన్నారు.
పరిశుభ్రత ఉన్నప్పుడే మంచి ఆరోగ్యం లభిస్తుంది..
- Advertisement -
RELATED ARTICLES


