Homeఆంధ్రప్రదేశ్కడియపులంకలో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

కడియపులంకలో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, కడియపులంక గ్రామంలో ఆదివారం ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శ్రీ లక్ష్మీ గణపతి హోమం, శ్రీ స్వామి అయ్యప్ప లక్ష బిల్వార్చన, పడి పూజా మహోత్సవం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను శ్రీ సత్యదేవా నర్సరీ యువరైతు పుల్లా రాజశేఖర్ స్వామి తన మొదటి శబరిమల యాత్ర సందర్భంగా, పుల్లా ఆంజనేయులు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తాడాల వీర వెంకటరావు గురుస్వామి ఆధ్వర్యంలో, సత్తి వెంకటగిరి గురుస్వామి పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు. గురుస్వాముల ఆధ్యాత్మిక ప్రసంగాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అయ్యప్ప మాలధారుల స్వామివారి నామస్మరణతో గ్రామం మారుమ్రోగింది. ఈకార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు