Homeఆంధ్రప్రదేశ్అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న కంబాల

అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న కంబాల

- Advertisement -

_పడిపూజకు 25,000 వేలు రూపాయలు విరాళం_

 విశాలాంధ్ర – కోరుకొండ : కోరుకొండ గ్రామంలోని శ్రీ రుక్మిణి సమేత పాండు రంగస్వామి ఆలయం వద్ద ఆదివారం రాత్రి నిర్వహించిన అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమంలో విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. తొలిత అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు కంబాల శ్రీనివాసరావుకి ఘన స్వాగతం పలికి, పూలమాలలతో సత్కరించారు. పడిపూజ కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు 25,000 వేలు రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, విదేశాల నుంచి మనదేశంలోకి దుర్మార్గులు చొరబడి హిందువులను నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్నారని, వీటిని మనమందరం సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి కలిసికట్టుగా నిలబడాలన్నారు. ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు