Homeఆంధ్రప్రదేశ్మాతృత్వ వందనం.. అందుకోండి సాయం

మాతృత్వ వందనం.. అందుకోండి సాయం

- Advertisement -

 జిల్లా వ్యాప్తంగా 1556 అంగనవాడి కేంద్రాల పరిధిలో సుమారు రెండువేల మంది గర్భిణుల నమోదు.

 విశాలాంధ్ర – కొవ్వూరు :  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు పేద మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన లో భాగంగా తొలి శిశువు ప్రసవానికి రూ 5000, రెండో కాన్పులో ఆడ శిశువు జన్మిస్తే రూ 6000 అందజేస్తారు ఈ నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. అర్హులైన వారి వివరాలు ఆన్లైన్లో నమోదు ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది .అర్హులైన వారు ఇప్పటికే జిల్లాలో రెండు వేలకు పైగా గర్భిణీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జిల్లాలోని 1556 అంగన్వాడీ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ నమోదు జరుగుతుంది. తిరస్కరణకు గురైన వారు వాటికి సంబంధించి ప తిరస్కరణకు గురైన వారు వాటికి సంబంధించి పక్కా ఆధారాలు ధ్రువపత్రాలతో అర్హతలు ధ్రువీకరించుకోవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ అందజేసిన జాబితాలో పెండింగ్లో ఉన్నవారు అంగన్వాడీ కేంద్రాలను సంప్రదించవచ్చు. అదేవిధంగా కొత్తవారికి ఈ పథకం వర్తించేలా చర్యలు చేపడుతున్నారు. మొదటి కాన్పులో మొదటి బిడ్డ ఏ బిడ్డ అయినా సాయం అందుతుంది. రెండో కాన్పులో ఆడబిడ్డ అయితేనే సాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ కు ముందు ఈ బాధ్యతలను ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఉన్న ఏఎన్ఎం కార్యకర్తలు నిర్వహించేవారు. అనంతరం ఈ ఏడాది జూన్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఐసిడిఎస్ కు బదలాయించారు. అంగన్వాడి కేంద్రాల్లోని కార్యకర్తలు గర్భిణుల వివరాలను పోషణ్ ట్రాకర్ యాప్ లో నమోదు చేస్తున్నారు. 2018లో అమల్లోకి వచ్చిన ఈ పథకం అప్పట్లో తెలరంగు రేషన్ కార్డు ఉన్న గర్భిణీలకు ఐదు వేల చొప్పున అందజేశారు. ఈసారి రెండో కాన్పులో ఆడపిల్ల జన్మిస్తే 6000 ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ నెల నుంచి ప్రతినెల అంగన్వాడీ కేంద్రాలకు ప్రసవాల వివరాలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో సాధారణ కాన్పు అయ్యే అవకాశం ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ పేరు చెప్పి వేలాది రూపాయలు దోచేస్తున్నారు ఈ విధానాన్ని కట్టడి చేసేందుకు ఈ పథకం దోహదం చేస్తుంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రభుత్వ ఉద్దేశమని అంగనవాడీ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు