కాంగ్రెస్ నాయకులు తుంపర్తి పరమేష్
విశాలాంధ్ర ధర్మవరం; భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని భారతదేశ ఉక్కు మహిళ స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి 41వ వర్ధంతి సందర్బంగా ధర్మవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తుంపర్తి పరమేష్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశ నిర్మాణం లో ఇందిరా గాంధీ గారి చెరిగిపోని ముద్ర వేశారని ముఖ్యంగా పేదరిక నిర్ములన, అంటరానితనం నిర్ములన, పేదలకు ఇల్లు మరియు భూమిపంపిణి వంటి ఎన్నో శాశ్వతమైన ప్రజా సంక్షేమ ముద్ర వేశారని కొనియాడారు.. వారి సేవలకు సార్థకంగా ధర్మవరం పట్టణం లో ఇందిరాగాంధీ గారి కాంష్యవిగ్రహం ఏర్పాటుకు అనువైన స్థలం కేటాయించాలని మున్సిపల్ కమిషనర్ కోరడమైనది అని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఏపీ ఎమ్మార్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు కేశగాళ్ల వెంకటేష్ గారు, ఎన్ఎస్ యు ఐ నాయకులు సురేష్, నరేష్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్, రాజు మధు తదితరులు పాల్గొన్నారు
ఘనంగా ఇందిరాగాంధీ 41వ వర్ధంతి
- Advertisement -
RELATED ARTICLES


