విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరం మండలంలోని చెన్నూరు గ్రామంలో దానిమ్మ తోటకు నిప్పు పెట్టడంతో రైతుకు 15 లక్షల నష్టం వాటిల్లిందని రైతు చుక్కలూరు రాము తన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 3200 దానిమ్మ చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యిందని, పూత కాయ దశలో పంట నష్టం రావడం నాకెంతో బాధను కలిగించిందని తెలిపారు, అంతేకాకుండా మంటల్లో రైతు యొక్క టూ వీలర్ కూడా దగ్ధం కావడం మరింత బాధలు కలిగించిందని తెలిపారు. ఆరున్నర ఎకరాలలో తోట పూర్తిగా నష్టం అయ్యిందని ప్రభుత్వం ఆదుకోవాలని ఆ రైతు విజ్ఞప్తి చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తోటకు నిప్పు పెట్టడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. అంతేకాకుండా పంటతో పాటు డిప్ వైరు కూడా అగ్నికి ఆహుతి అయిందని రైతు కన్నీటి పర్యంతం అయ్యారు. దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నానని అయితో రెండు పంటలు పూర్తిగా నష్టపోవడం నన్ను మనోవేదనకు గురి చేస్తోందని వారు బాధను వ్యక్తం చేశారు. ఈ సార్ అయినా వంట పూర్తిగా చేతికి వస్తుందని లక్షల్లో అప్పులు చేయడం జరిగిందని తెలిపారు. ఇంటి నుండి పొలముకు వచ్చేటప్పటికి పూర్తిగా పంట అగ్నికి దగ్ధం అయ్యిందని, ఏమి చేయాలో దిక్కు తోచక స్థితిలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడం జరిగిందని, వారు వచ్చే పార్టీకి కొంచమైనా మంటలను అదుపు చేయాలని నా టూ వీలర్ ని పక్కన పెట్టి మంటలు ఆర్పుతున్న సమయంలో 2 వీలర్ కూడా అగ్నికి ఆహుతి కావడం మరింత బాధలు కలిగించిందని తెలిపారు. దాదాపుగా 15 లక్షల వరకు నష్టం వాటి లేదని తెలిపారు. కావున ప్రభుత్వము ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్య కుమార్ యాదవ్ నన్ను నా కుటుంబాన్ని ఆదుకొని తగిన నష్టపరిహారాన్ని ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.
దానిమ్మ తోటకు నిప్పు.. రైతుకు రూ.15 లక్షల నష్టం.. రైతు ఆవేదన
- Advertisement -
RELATED ARTICLES


