Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్రంథాలయములో వేసవి శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోండి..

గ్రంథాలయములో వేసవి శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోండి..

- Advertisement -

గ్రంథాలయములో అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంధాలయంలో మే నెల 28 నుండి జూన్ 6వ తేదీ వరకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సుచనా తరగతుల్లో విద్యార్థులకు కథలు చెప్పడం ,పుస్తకాలు చదవడం, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, పెయింటింగ్ ,డాన్స్, క్విజ్ తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ సుచనా తరగతులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ వేసవి శిక్షణ తరగతులకు పంపాలని వారు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు