Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు టీం వర్క్ తప్పనిసరిగా చేయాలి..

ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు టీం వర్క్ తప్పనిసరిగా చేయాలి..

- Advertisement -

ఎంఈఓ లు.. రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం మండలం అర్బన్, రూరల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు పాఠశాల పునః ప్రారంభ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు టీం వర్క్ తప్పనిసరిగా చేయాలని ఎంఈఓ లు.. రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల పై కప్పు వర్షం పడడం వల్ల వర్షపు నీరు నిలిచి ఉంటుంది అని,కాబట్టి వెంటనే అడ్డొచ్చిన చెత్తను తొలగించి, నీళ్లు కిందికి పంపించాలి అని తెలిపారు. ఈ పని ఆయాల ద్వారానో వేరే వారి ద్వారా చేపించాలి విద్యార్థులతో చేపించకూడదని తెలిపారు.తరగతి గదులను శుభ్రంగా ఉండేటట్లు చూడాలి అని, ట్యాంకులను, ఆర్ఓ ప్లాంట్లను క్లోరినేషన్ చేపించి శుభ్రంగా ఉంచాలన్నారు.. ఆయాల ద్వారా టాయిలెట్లను శుభ్రపరపిచ్చి రన్నింగ్ వాటర్ ఉండేటట్లు చూడాలి అని తెలిపారు. . మొదటి రోజు నుంచి మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం చేపట్టాలి అని,మీకు ఇచ్చినటువంటి ఎస్ ఆర్ కె వి ఎం 11 ఇట్లు సరిగా ఉన్నాయో? ఏదైనా తక్కువ వచ్చాయా? ఎక్కువ ఉన్నాయా? సరిచేసి మాకు తెలపాలన్నారు. అడ్మిషన్ డ్రైవ్ చేపట్టాలి అని, లీప్ యాప్ లో మొదటి రోజు మీ హాజరును నమోదు చేయాలి అని తెలిపారు. తల్లితండ్రులకు లీప్ యాప్ డౌన్లోడ్ చేపించి అన్ని కార్యక్రమాల గురించి అవగాహన కల్పించాలి అని అన్నారు. మీ దగ్గర మీ రోల్ ని బట్టి డ్యూయల్ డిస్కులు ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే ఎంఈఓ తెలియజేయాలి అని తెలిపారు. మోడల్ స్కూల్ అన్నీ కూడా మీకు సంబంధించిన మనబడి మన భవిష్యత్ కార్యక్రమం కింద వెంటనే పనులు ప్రారంభించాలి అని తెలిపారు.
(మేజర్ మైనర్ వర్క్, టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్) ఇవి రెండు ఎస్ఎంసి ద్వారా తప్పనిసరిగా జరగాలన్నారు.
పనులు ప్రారంభించక ముందు మీ ఏరియా ఇంజనీర్ ద్వారా ఎస్టిమేషన్ యాప్ లో అప్లోడ్ చేయాలి అన్నారు,
మనబడి మన భవిష్యత్తు ఫేస్2 సంబంధించిన ఓచర్లు, బిల్లులు అప్లోడ్ చేయాలి అన్నారు. పైన చెప్పినటువంటి అన్ని పనులు వెంటనే చేపట్టి విద్యార్థులకు పండగ వాతావరణం లో పాఠశాలకు ఆహ్వానించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు