Homeజిల్లాలుకర్నూలురైతులకు అండగా కూటమి ప్రభుత్వం

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : కూటమి ప్రభుత్వం రైతుల అండగా ఉంటుందని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక సహకార సంఘం నందు సొసైటీ అధ్యక్షులు మీసేవ ఆంజనేయులు అధ్యక్షతన, మండల వ్యవసాయ అధికారిణి సుచరిత సమక్షంలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే రైతులకు అవసరమైన యూరియాను కూటమి ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, బీసీ సెల్ సాధికార సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున, సొసైటీ సభ్యులు ఎంజీ నరసన్న, కోసిగి మార్కెట్ యార్డు డైరెక్టర్ కలుగొట్ల లక్ష్మన్న, నాయకులు ప్రతాప్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు