Homeజిల్లాలుశ్రీ సత్యసాయికార్పొరేట్ రిటైల్ పై నియంత్రణ..

కార్పొరేట్ రిటైల్ పై నియంత్రణ..

- Advertisement -

వస్త్ర వ్యాపారం సంఘ అధ్యక్షుడు కోటి వెంకటేష్, తదితర సంఘం అధ్యక్షులు వెల్లడి
విశాలాంధ్ర ధర్మవరం;; కార్పొరేట్ రిటైల్ పై నియంత్రణ ఉండాలని, భారీ షాపింగ్ మాల్స్ నుంచి రక్షించాలని వస్త్ర వ్యాపారం సంఘము అధ్యక్షుడు కోటి వెంకటేష్, కిరాణా సంఘం అధ్యక్షుడు పిన్ను ప్రసాద్, గోల్డ్ షాప్ అధ్యక్షులు ఖలీల్, స్వీట్ షాపుల సంఘం లడ్డు బాబు, ఆటోమొబైల్ సంఘం అధ్యక్షులు వెంకటరమణ, ఆల్ టైలర్ అసోసియేషన్ సంఘ అధ్యక్షుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో నాడు స్థానిక వ్యాపార అభివృద్ధి లక్ష్యంగా 18 వ్యాపార సంఘ ల ఐకమత్యంతో ది ఆల్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు కు, ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్కు, ధర్మవరం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కు, ధర్మవరం సబ్ డివిజన్ అధికారికు స్థానిక చిన్న, మధ్య తరహా వ్యాపార సముదాయాలను కార్పొరేట్ రిటైల్ చైన్ల భారీ షాపింగ్ మాల్స్ నుంచి రక్షించ వలసిందిగా వినతి పత్రాలు అందజేశారు. తదుపరి
అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ మా సంఘంలో ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ ఉద్యోగ , ఉపాధి అవకాశాలు లేక స్వయం ఉపాధిగా చిన్న , మధ్య తరహా వ్యాపారాలు నిర్వహిస్తున్న యువత తో పాటు చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు , సాంప్రదాయ వృత్తులపై ఆధారపడిన వారు చాలామంది ఉన్నారు అని తెలిపారు. వీరి జీవనాధారం పూర్తిగా స్థానిక వ్యాపారంపై ఆధారపడి ఉన్నది అని, ప్రస్తుతం పెద్ద కార్పొరేట్ రిటైల్ సంస్థలు , మాల్స్ మార్కెట్ ను గుత్తాధిపత్యంగా మార్చి నష్టాలతో అమ్మకాలు చేసి చిన్న వ్యాపారులను దెబ్బతీయడం వంటి చర్యల ద్వారా మా పరిస్థితి ” అడ కత్తెర లో పోక చెక్క” వలే అయినది అని బాధను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇది స్థానిక వ్యాపార వ్యవస్థను బలహీనపరిచి, వేలాది కుటుంబాల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిపారు. కావున ” మన ఊరు- మన దుకాణం ” అనే నినాదంలో నగదు బదిలీ జరిగి స్థానిక వ్యాపారస్తుల అభివృద్ధితో పాటు ప్రజల జీవన నాణ్యత , విద్య , వైద్యం , పేదరిక నిర్మూలన వంటి అంశాలను ప్రభావితం చేస్తుంది. కార్పొరేట్ వ్యవస్థ పేదరికాన్ని నిరుద్యోగాన్ని పెంచి దేశ పురోగతిని మందగింప చేస్తాయి అని తెలిపారు. కావున దయచేసి స్థానిక వ్యాపారులకు ప్రాధాన్యత కల్పించి మన ధర్మవరంలో పెద్ద రిటైల్ చైన్ల పై నియంత్రణ చేయవలసిందిగా అధికార పార్టీ నాయకులను కూడా కోరడం జరిగింది అన్నారు.. ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ స్థానిక ప్రజల సంరక్షణ మా బాధ్యత అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో వివిధ వ్యాపార సంఘానికి సంబంధించిన వ్యాపారస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు