Homeజిల్లాలుశ్రీ సత్యసాయికార్యకర్తల నుండి వసూలు పై ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తాం...

కార్యకర్తల నుండి వసూలు పై ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తాం…

- Advertisement -

టి ఎన్ టి యు సి పార్లమెంట్ అధ్యక్షుడు నాగభూషణం
విశాలాంధ్ర ధర్మవరం;రాష్ట్రవ్యాప్తంగా మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా మార్చడం జరిగింది అని, మొదటి విడుదల 4685 రెండో విడతగా 340 కేంద్రాలను మార్చడం జరిగింది అని, దీనికి ప్రధాన కారణము శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి సంధ్యారాణి నారా లోకేష్ సూచనల మీదకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ఆమోదం తెలిపింది అని రాష్ట్రంలో తెలుగు నాడు అంగన్వాడి బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది అని, కొంతమంది రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా చేసింది మేమే అని చెప్పుకుంటూ కొన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు నుండి 5000 నుంచి 11500 వరకు వసూలు చేయడం దారుణమని. ఈ విషయంనురాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడం జరిగిందని టీఎన్ టియుసి పార్లమెంటు అధ్యక్షులు నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ దీనిపై స్పందించిమాట్లాడుతూ మంత్రులు లోకేష్ బాబు ఉమ్మడి సంధ్యారాణి సంబంధించిన అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. కావున ఏ ఒక కార్యకర్త ఎలాంటి డబ్బులు ఇవ్వకూడదు అని, ఎవరైనా సంఘాల పేరుతో బెదిరిస్తే సంబంధిత అధికారులకు తెలియజేయాలని తెలిపారు. టిఎన్టియుసికి అనుబంధంగా ఉన్న తెలుగు నాడు అంగన్వాడి యూనియన్ సభ్యులకు తెలియజేయాలని తెలిపారు.కావున ఎటువంటి వసూళ్లకు పాల్పడినా చట్టపరమైన చర్యలు చేపడతామని లేకపోతే ఇంకా ఒక ఎంక్వైరీ కమిషన్ను కూడా వేస్తామని అధికారులను మంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. కావున ఏ ఒక్కరూ ఇలాంటి బెదిరింపులకు భయపడకుండా మా దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. కార్యక్రమంలో టి ఎన్ టి యు సి ధర్మవరం పట్టణ నాయకులు చిల్లా బొట్టుకృష్టప్ప, మరస సాయి, లింగమయ్య, రాజప్ప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు