Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాప్రజలను దగా చేస్తూ రెండేళ్ల కూటమి పాలన… ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్

ప్రజలను దగా చేస్తూ రెండేళ్ల కూటమి పాలన… ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్

- Advertisement -

విశాలాంధ్ర నందిగామ:-ప్రజలను దగా చేస్తూ ఉండేళ్ల కూటమి పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రెండేళ్ల కూటమి వెన్నుపోటు పాలనపై స్థానిక గాంధీ సెంటర్లో నియోజకవర్గస్థాయిలో స్థానిక మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు,స్థానిక నాయకులతో కలిసి గలం విప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాంతం మోసాలు వెన్నుపోటు దగాలు స్టాంప్లే అనిపిస్తున్నాయని ప్రజలను నమ్మించి అధికారం చేపట్టి ప్రజలం ఈ రెండేళ్లలో అనేక రకాలుగా మోసపూరితంగా పరిపాలన కొనసాగిస్తున్నారని చంద్రబాబు నాయుడు ప్రజలను మరోసారి వెన్నుపోటు పొడిచారని అన్నారు రాష్ట్రాన్ని అమరావతి పేరుతో రాజధాని నిర్మాణం అంటూ చంద్రబాబు కుటుంబం ఏటీఎం డెబిట్ కార్డ్ లాగా ఉపయోగించుకుంటున్నారని రాజధాని నిర్మాణ పనులలో చదరపు అడుగుకి 4350 నుండి మొదలుపెట్టి 20వేల 439 రూపాయల వరకు అంచనా వ్యయాన్ని పెంచి అడ్డంగా దోచుకుంటున్నారని పేర్కొన్నారు రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేక యువతకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులకు మెగా డీఎస్సీ పేరుతో దగా స్కాం నిర్వహించి 1 పద్ధతిలో వెరిఫికేషన్ అంటూ స్కామ్ నిర్వహించి అభ్యర్థుల గొంతు కోశారని అన్నారు ఆరోగ్యశ్రీ నెట్టివేయడం చేసి మెడికల్ కాలేజీలను మర్చిపోయారని ప్రాజెక్టులను గాలికి వదిలేసారని చంద్రబాబుకు కావలసిందిగా అమరావతి పేరుతో 23 గ్రామాల దోపిడీ తప్ప ఏమీ అవసరం లేదని ఎద్దేవా చేశారు జగన్ పేర్కొన్న మావిగన్ పేరు నచ్చకపోతే ఆయన చేసిన ప్రతిపాదన ప్రకారం మచిలీపట్నం విజయవాడ గుంటూరు మంగళగిరి తెనాలి పట్టణాలు మధ్య రాజధాని అభివృద్ధి చేసి స్టేట్ క్యాపిటల్ రీజనల్ గా చేయాలని దేశ రాజధాని ఢిల్లీ నగరం కూడా నోయిడా గురుగ్రం ఫరీదాబాద్ కలిపి నేషనల్ క్యాపిటల్ నిజంగా అభివృద్ధి జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు నందిగామలో స్థానిక నాయకుల తీరు విచిత్రంగా ఉందని పేర్కొన్నారు వంద పడకల హాస్పిటల్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, శివాలయం అభివృద్ధికి నిధులు, శివాలయం రథాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అని ప్రశ్నించారు నేడు సమావేశాలు జరుపుకుంటున్న బాబు జగజీవన్ రామ్ భవన్ అభివృద్ధి చేసింది ఎవరు ఆర్డిఓ కార్యాలయం పట్టణ ప్రధాన రోడ్లు విస్తరణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అనాసగరం డివిఆర్ కాలనీ హాస్పిటల్ కట్టింది ఎవరు అని ఆయన స్థానిక నాయకులను ప్రశ్నించారు ఇది జరిగిన అభివృద్ధి అంతా అమౌంట్ తోక జగన్మోహన్ రావు హయాంలో చేశామని పేర్కొన్నారు నేడు టిడిపి పాలనలో నందిగామలో డమ్మీ ఎమ్మెల్యే పాలన సాగుతుందని పరిపాలన్నంత ఏ బాబు చేతిలో ఉందో అందరికీ తెలుసని సొంత నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఎమ్మెల్యే కొనసాగుతుందని అన్నారు మాకు వసూల్ బ్రదర్స్ అని పేరు పెట్టిన స్థానిక ఎమ్మెల్యే మరి నేడు ఏం చేస్తుందని ప్రశ్నించారు అక్రమ ఇసుక, మట్టి మాఫియా తో కమిషన్ల దండుకొని దుర్మార్గపు పాలన చేస్తున్నారని పేర్కొన్నారు మా ప్రభుత్వ హయాంలో సాధించిన వాటిని తిరిగి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడమే మీరు ఈ రెండేళ్లలో సాధించిన ఘనత అనే ప్రశ్నించారు కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అన్యాయంగా వేధించిన ఏ ఒక్కరిని వదిలి పెట్టేది లేదని రానున్న రోజుల్లో వారికి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు అంతకుముందు దున్నపోతుపై ఆర్డిఓ కార్యాలయం వద్దకు చేరుకొని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి వైసీపీ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు