Thursday, December 19, 2024
Homeఆంధ్రప్రదేశ్కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయని చెత్త పాలన మీది…

కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయని చెత్త పాలన మీది…

వైసిపి పై మంత్రి నాదెండ్ల విసుర్లు
గత సీజన్‌లో వైసీపీ ప్రభుత్వం గుంటూరు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కనీస సేకరణ కూడా చేపట్టలేదని, ఎందుకు చేయలేకపోయారని మంత్రి ప్రశ్నించారుపౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ . సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పుడూ రైతుల గురించే ఆలోచిస్తారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ాఅన్నదాతకు అండగా వైసీపీ్ణ పేరిట వైఎస్సార్‌సీపీ నాయకులు కలెక్టరేట్ల వద్దకు ధాన్యం బస్తాలు తీసుకెళ్లి ఫొటో‌షూట్లు చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపించే విషయంలో చంద్రబాబు సర్కారు ముందుంటుందని, అన్నదాతలకు అండగా నిలుస్తుందని తెలిపారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ధాన్యం కొనుగోలు విషయంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతన్నలకు బకాయిలు చెల్లించకుండా మోసం చేసిందని, వైసీపీ సర్కారు చెల్లించాల్సిన బకాయిలను కూడా కూటమి ప్రభుత్వమే చెల్లించిందని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఏ ప్రభుత్వం అండగా నిలబడుతుందో జనాలకు తెలుసునని వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్రభుత్వంలో గత ఖరీఫ్ సీజన్‌లో డిసెంబర్ 13 నాటికి 9,40,936 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారని, అయితే కూటమి ప్రభుత్వం ఈ సీజన్‌లో ఇప్పటికే 16,34,151 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని ఆయన వివరించారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ రాకముందే రైతుల కళ్లల్లో సంతోషం కనిపిస్తోందని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ధాన్యం విక్రయాల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, దళారులకు తక్కువ ధరకే అమ్ముకోవదని ఆయన పునరుద్ఘాటించారు. ధాన్యం విక్రయాల విషయంలో రైతులను ఎవరైనా ఇబ్బంది పెట్టారని తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు