Homeజిల్లాలుఅనంతపురంఉత్తమ పొలిటిషన్ గా వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా గుర్తింపు

ఉత్తమ పొలిటిషన్ గా వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా గుర్తింపు

- Advertisement -

ఈనెల 8, 9 తేదీలలో ముంబైలో జరిగే శిక్షణకు ఎంపిక

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోనాలిసా ఉత్తమ పొలిటిషన్ గా గుర్తింపు పొందారు. ఈ మేరకు ఢిల్లీ షి రిప్రజెంటేటివ్ ప్రతినిధులు వెల్లడించారు, ఈనెల 8, 9 తేదీలలో ముంబైలోని ఇంటర్నేషనల్ హౌస్ 18 వై.ఎం.సి ఏ ముంబై సెంట్రల్ కన్వెన్షన్ నందు ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలు, తదితర అంశాలపై జరగనున్న శిక్షణకు సర్పంచ్ హాజరుకానున్నారు, ఈ సందర్భంగా సర్పంచ్ మోనాలిసా గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దేశ ఆర్థిక రాజధాని గా పేరుగాంచిన ముంబై నగరంలో జరగనున్న శిక్షణకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని,ఈ శిక్షణలో వారు అందించే అంశాలను తెలుసుకోవడంతో పాటు,పలు అంశాలపై కూడా మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు, గతంలో కూడా ఢిల్లీలో జరిగిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు దక్కించుకోవడం జరిగిందని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు