Homeజిల్లాలువిజయనగరంఅక్రమ రేషన్‌ బియ్యం పట్టివేత - వ్యాపారిపై 6A కేసు

అక్రమ రేషన్‌ బియ్యం పట్టివేత – వ్యాపారిపై 6A కేసు

- Advertisement -

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా రాజాం పట్టణం కాలెపు వీధిలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్‌ బియ్యం పై సివిల్‌ సప్లయ్స్‌ డ విజిలెన్స్‌ శాఖ అధికారులు గురువారం దాడి నిర్వహించారు. పక్కా సమాచారం ఆధారంగా జరిగిన ఈ దాడిలో వ్యాపారి అప్పలరాజు ఇంటిలో భారీగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం బయటపడింది.అధికారులు మొత్తం 8 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ సరుకును అక్రమంగా నిల్వ ఉంచినందుకు సంబంధించి అప్పలరాజుపై 6A చట్టం మేరకు కేసు నమోదు చేసినట్టు సివిల్‌ సప్లయ్స్‌ డిపార్ట్మెంట్ డిటి అనంత్ కుమార్ తెలిపారు.రేషన్ బియ్యాన్ని కొనడంఉఅమ్మడం చట్టరీత్యా నేరం అని, ఇటువంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు