Saturday, December 21, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిలేకరుల దాడులకు కారకులైన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి..

విలేకరుల దాడులకు కారకులైన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ రమేష్.
విశాలాంధ్ర ధర్మవరం;; విలేకరుల దాడులకు కారణమైన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ రమేష్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌడప్ప డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మీడియాపై దాడులు చేయడం అతి దారుణమైన హేయమైన చర్య అని, ఈ దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కోసం సమస్యలను పరిష్కరించే విలేకరులపై ఇటువంటి దాడులు జరగడం దారుణమని, భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం గట్టి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిజాలను నిర్భయంగా రాసి సమాజంలో జరుగుతున్న అవినీతిని ప్రజలకు తెలియజేయు విలేకరులపై ఇటువంటి దాడులు మున్ముందు జరిగితే, తమ ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. సమాజం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మీడియా వారికి భద్రత కల్పించాలని తెలిపారు. అదేవిధంగా ప్రైవేట్ భవనర్సపై కేసు బుక్ చేయాలని, సినిమా విద్యకు సంబంధించిన కార్యక్రమాలపై వార్తలను 10 సంవత్సరాల పాటు బహిష్కరణ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, సాకే వీరనారప్ప, రామాంజనేయులు, మల్లెల పెద్దన్న ,కుల్లాయప్ప, ఆంజనేయులు ,సాకే సుబ్బరాయుడు, దేవరకొండ నరసింహులు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు