విశాలాంధ్ర ధర్మవరం;; విద్యలో నైతిక విలువల ప్రాముఖ్యత అనే కార్యక్రమం పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపాల్ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు భగవాన్ భాయ్ , రాధా సిస్టర్ లు విద్యార్థులకు అవగాహన చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ తమ జీవితం లో విద్యతో పాటు నైతిక విలువలు కూడా పెంపొందించుకోవాలని తెలియచేసారు. ఇంకా విద్యార్థులే భారతదేశ భవిష్యత్తు అని, వారి విద్యార్థి జీవితంలో వారికి అందించిన విలువలపై మన దేశ భవిష్యత్తు చాలా ఆధారపడి ఉంటుందని తెలిపారు. నైతిక విలువలు జీవితంలో వారి అన్ని నిర్ణయాలకు మార్గం సుగమం చేస్తాయి అని, ఈ విలువలు లేకుండా, పిల్లలకు ఎటువంటి మార్గదర్శకత్వం ఉండదు అని,వారి జీవితం దిక్కులేనిదిగా అనిపించవచ్చు అని, సమాజంచే ఆమోదించబడటానికి మరియు గౌరవించబడటానికి, తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ బలమైన నైతిక విలువలను పిల్లలలో ఒక జీవనశైలి వలె నింపేలా చూసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, అధ్యాపకులు తల్లితండ్రులు,, ఎన్ఎస్ఎస్ఆఫీసర్.. కుళ్లాయిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
విద్యలో నైతిక విలువల ప్రాముఖ్యత కార్యక్రమ పై అవగాహన.. ప్రిన్సిపాల్ ప్రశాంతి
RELATED ARTICLES