Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

గోవాండిలో కుప్పకూలిన భవనం..

ముగ్గురు మృతి
భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. ముంబై నగరంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళితే, ముంబైలో గోవాండి ప్రాంతంలోని శివాజీనగర్‌లో రెండు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికి అక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను హుటాహుటీన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌, అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి సహాయ పునరావాస పనులు చేపట్టారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడి.. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఊళ్లకు ఊళ్లు జలదిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. మహద్‌తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 300 మంది చిక్కుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఐదుగురు ప్రాణాలు కూడా కోల్పోయారు. రోడ్లు, ధ్వంసం కావడంతో కొల్హాపూర్‌ జిల్లాలో సుమారు 47 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.అటు నాందేడ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.పాంచగంగలో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో సుమారు 10 రాష్ట్ర హైవేల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముంబై నుంచి పూణే, నాసిక్‌, కొంకణ్‌, ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ నిలిచిపోయాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img