Homeజాతీయంఇది ముష్కరుల చర్యే

ఇది ముష్కరుల చర్యే

- Advertisement -

దోషులకు కఠిన శిక్ష తప్పదు
కేంద్రం అధికారిక ప్రకటన

న్యూదిల్లీ: దిల్లీలో జరిగిన భారీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్‌ ఖండిరచింది. రెండు నిమిషాలు మౌనం పాటించడం ద్వారా ఈ ఘటనలో మృతిచెందినవారికి సంతాపం తెలిపింది. పేలుడు ఉగ్రవాదుల చర్యేనని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని నిర్ణయించింది. ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేస్తామని కేబినెట్‌ వెల్లడిరచింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి… శిక్షిస్తామని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. దిల్లీ పేలుడు నేపథ్యంలో బుధవారం సాయంత్రం కేబినెట్‌ సమావేశంతో పాటు కేంద్ర భద్రతా మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో ఎర్రకోట పేలుళ్లు, ఉగ్రవాద నిర్మూలనపై ప్రత్యేక చర్చ జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కారు పేలుడు ఘటనలో తదుపరి కార్యచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు, అంతర్గత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలపై కేంద్ర మంత్రివర్గంలో చర్చించినట్లు తెలుస్తోంది.
ఎగుమతుల బలోపేతానికి కీలక నిర్ణయం: ఎగుమతుల ప్రమోషన్‌ మిషన్‌ బలోపేతానికి రూ.25,060 కోట్ల కేటాయింపులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతులకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ మిషన్‌ కింద రెండు పథకాలను కేంద్రం నిర్వహించనుంది. నిర్యాత్‌ ప్రోత్సాహన్‌, నిర్యాత్‌ దిశ కొత్త పథకాలను కేంద్రం అమలు చేయనుంది. ఎగుమతి దారులకు 100 శాతం క్రెడిట్‌ గ్యారెంటీ స్కీం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 20 వేల కోట్ల రూపాయల వరకు ఎలాంటి హామీ లేకుండా ఎగుమతి దారులకు ప్రభుత్వం రుణ పరంగా మద్దతు ఇవ్వనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు